మిక్స్డ్ టాక్ తో కూడా భారీ కలెక్షన్స్ రాబడుతున్నసూపర్ స్టార్ మూవీ.

Published on Jun 8, 2019 1:09 pm IST

సల్మాన్ , కత్రినా ఖైఫ్ కాంబినేషన్ లో అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో రంజాన్ కానుకగా “భారత్” ఈనెల 5న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైంది. ఐతే ఈ మూవీకి మొదటి షో నుండే కొంచెం మిక్స్డ్ టాక్ నడిచింది. సినిమాలో ఎమోషన్స్ ఎక్కువై రెగ్యులర్ గా సల్మాన్ మూవీ నుండి ఆశించే కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడంతో పాటు, స్లోగా సాగే మూవీ నేరేషన్ ఎక్కువైంది అని క్రిటిక్స్ తెలిపారు. వివాదాస్పద నటుడు,మరియు బాలీవుడ్ క్రిటిక్ అయిన కమల్ ఆర్ ఖాన్ ఐతే ఈ మూవీ షారుక్ ‘జీరో’, ‘అమీర్ థగ్స్ అఫ్ హిందూస్తాన్’ మూవీల కంటే కూడా చెత్త సినిమా అని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.

ఐతే సల్మాన్ స్టార్ డమ్ ముందు ఇలాంటి రివ్యూ లు, రేటింగ్లు ఏమి పనిచేయడం లేదు. విడుదలైన మూడు రోజుల్లో ‘భారత్’ 95.50 కోట్లు వసూళ్లు రాబట్టిందని ప్రముఖ మూవీ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తెలిపారు. మాస్ సెంటర్స్ లో కలెక్షన్స్ స్ట్రాంగ్ ఉండగా, ‘ఏ’ సెంటర్స్ లో మాత్రం స్వల్పంగా వసూళ్లు తగ్గాయని ఆయన తెలిపారు. రాబోయే సెలవుదినాలైన శనివారం,ఆదివారం వసూళ్లు పెరిగే అవకాశం ఉందన్నారు.

సంబంధిత సమాచారం :

More