బన్నీకి థ్యాంక్స్ చెప్పిన సల్మాన్ ఖాన్

Published on Apr 26, 2021 8:00 pm IST

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ చేస్తున్న కొత్త సినిమా ‘రాధే’. మే 13న ఈ చిత్రం థియేటర్లతో పాటు ఓటీటీల్లో కూడ ఒకేసారి రిలీజ్ కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో సల్మాన్ టీమ్ ప్రమోషన్లు స్టార్ట్ చేసింది. అందులో భాగంగా సినిమాలో రీమేక్ చేసిన సీటిమార్ పాటను రిలీజ్ చేశారు. సీటిమార్ ఒరిజినల్ వెర్షన్ అల్లు అర్జున్ యొక్క ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాలోనిది. ఆ పాట ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలుసు.

యూట్యూబ్ లో 200 మిలియన్ల వ్యూస్ సాధించింది. అందుకే సల్మాన్ ఖాన్ సినిమాలో ఈ పాటను రీమేక్ చేయించుకున్నారు. పాటలో బన్నీ, పూజా హెగ్డేల డ్యాన్స్ అదిరిపోతుంది. బన్నీ స్టెప్పులు చూడటం కోసమే పాటను మళ్ళీ మళ్ళీ వీక్షిస్తున్న ప్రేక్షకులు ఉన్నారు. బన్నీ నృత్యాలను పొగుడుతూ ‘సీటిమార్ పాటకు థాంక్స్ అల్లు అర్జున్. నే డ్యాన్స్, పెర్ఫార్మెన్స్, స్టైల్ సింప్లీ ఫెంటాస్టిక్’ అంటూ ట్వీట్ చేశారు సల్మాన్ ఖాన్. అల్లు అర్జున్ కూడ ‘థాంక్యూ సల్మాన్ గారు.. మీ నుంచి కాంప్లిమెంట్ అందుకున్నందుకు సంతోషంగా ఉంది. మీ రాధే సినిమా పెద్ద హిట్ అవాలి’ అంటూ సమాధానమిచ్చారు.

సంబంధిత సమాచారం :