సల్మాన్ ఖాన్ కు కోపం వచ్చింది.. నోటీసులు పంపాడు

Published on May 27, 2021 2:04 am IST

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కు కోపం వచ్చింది. అది కూడ ఒక రివ్యూవర్ మీద. సల్మాన్ ఖాన్ తన సినిమా విషయంలో రివ్యూలను పెద్దగా పట్టించుకోరు. ఆయన సినిమాలూ అంతే.. రివ్యూలను తలకిందులు చేస్తూ సక్సెస్ అయిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఆయన తాజా చిత్రం ‘రాధే’ విషయంలో మాత్రం సల్మాన్ ఖాన్ తీవ్ర పరాభవాన్ని ఎదుర్కున్నారు. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఓటీటీ ద్వారా విడుదలై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. భాయ్ అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.

ఇక విమర్శకుల సంగతి చెప్పనక్కర్లేదు. సినిమాను తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ఇక బాలీవుడ్లో స్వయం ప్రకటిత క్రిటిక్ అయిన కె ఆర్ కె అయితే హద్దులు దాటి మరీ ‘రాధే’ మీద విమర్శలు గుప్పించాడు. కథ నుండి మొదలుపెట్టి సినిమాలోని ప్రతి విషయాన్ని చులకన చేసేశాడు. దీంతో సల్మాన్ ఖాన్ కు కోపం వచ్చింది. తన సినిమాను అవమానించాడని, కె ఆర్ కె వలన తనకు పరువు నష్టం జరిగిందని అంటూ లీగల్ నోటీసులు పంపారు. చూస్తుంటే సల్మాన్ ఈ విషయాన్ని అంత ఈజీగా వదిలేలా కనబడట్లేదు. ఇక కె ఆర్ కె విషయానికొస్తే ఇప్పుడే కాదు గతంలో కూడ అనేకమార్లు పలువురు హీరోలను వారి సినిమాలను టార్గెట్ చేసి వార్తల్లో నిలిచాడు.

సంబంధిత సమాచారం :