వేల మంది కార్మికుల్ని ఆదుకోవడానికి ముందుకొచ్చిన స్టార్ హీరో

వేల మంది కార్మికుల్ని ఆదుకోవడానికి ముందుకొచ్చిన స్టార్ హీరో

Published on Mar 29, 2020 12:22 PM IST

సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటారు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్. ఇప్పటికే ఒక ఎన్జీవో ద్వారా పేదలకు వైద్య, విద్యా సహాయం చేస్తున్న సల్మాన్ కరోనా లాక్ డౌన్ కష్టకాలంలో కూడా తన వంతు సహకారం అందివ్వడానికి ముందుకొచ్చారు. కోవిడ్ 19 వ్యాప్తి నివారణలో భాగంగా బాలీవుడ్ పరిశ్రమతో పాటు అన్ని సినీ పరిశ్రమలు మూతబడ్డాయి.

పెద్దదైన హిందీ ఇండస్ట్రీ తాత్కాలికంగా ఆగిపోవడంతో వేల మంది కార్మికులకు ఉపాది కరువైంది. రోజువారీ వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇది గుర్తించిన సల్మాన్ సుమారు పాతిక వేల మంది కార్మికులను ఆదుకోవడానికి ముందుకొచ్చారు. వారందరకీ రోజువారీ నిత్యావసరాలతో పాటు ఆర్థిక సహాయం అందివ్వాలని సల్మాన్ సంకల్పించుకున్నారు. సల్మాన్ చేస్తున్న ఈ సహాయం కష్టాల్లో ఉన్నవారికి పెద్ద ఉపశమనం అవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు