ప్రేమాలయం కి పాతికేళ్ళు…!

ప్రేమాలయం కి పాతికేళ్ళు…!

Published on Aug 5, 2019 7:21 PM IST

సల్మాన్ ఖాన్ నటించిన చారిత్రాత్మక చిత్రం “హమ్ ఆప్ కె హై కోన్” చిత్రం నేటి సరిగ్గా 25వసంతాలు పూర్తి చేసుకుంది. రాజశ్రీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై దర్శకుడు సూరజ్ బర్జాత్యా తెరకెక్కించిన “హమ్ ఆప్ కె హై కోన్” చిత్రం ఆగస్టు 5, 1994లో విడుదలైంది. స్వచ్ఛమైన కుటుంబ ప్రేమ,అనుభందం,ఎమోషన్స్ కథాంశంగా తెరకెక్కిన ఈ చిత్రంలో 90లలో ఒక ట్రెండ్ సెట్టింగ్ మూవీగా నిలిచింది. స్టార్ హీరో చిత్రం అంటే బీభత్సమైన పోరాటాలు హింసా ఉండాలనే మూసధోరణి కి భిన్నంగా తెరకెక్కిన ఈ చిత్రం అనేక రికార్డులు సృష్టించింది.

భారత చిత్ర పరిశ్రమలో మొదటి వంద కోట్ల సినిమాగా “హమ్ ఆప్ కె హై కోన్” చిత్రం నిలిచిపోయింది. సల్మాన్ కి జంటగా నటించిన మాధురి దీక్షిత్ నటనతో పాటు, డాన్సులతో అద్భుతంగా అలరించారు. ముఖ్యంగా ఈ చిత్రంలో పాటల గురించి చెప్పుకోవాలి. రామ్ లక్ష్మణ్ అందించిన మ్యూజిక్ ఈ చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. మూడుగంట పైగా నిడివి గల ఈ చిత్రంలో చిన్నవి,పెద్దవి కలుపుకొని మొత్తం 14పాటలు ఉంటాయి. అప్పట్లో ప్రతి ఇంట్లో ఈ చిత్రంలోని పాటలు వినిపించేవంటే అతిశయోక్తి కాదు. కొన్నేళ్ల పాటు ఈ చిత్రంలోని పాటలు ప్రేక్షకులను వెంటాడాయి.

తెలుగులో ఈ చిత్రం “ప్రేమాలయం” పేరుతో విడుదలై ఇక్కడ కూడా ఘనవిజయం అందుకుంది. తెలుగులోకి అనువదించబడిన “హమ్ ఆప్ కె హై కోన్” సాంగ్స్ తెలుగు వారిని కూడా అమితంగా ఆకట్టుకోవడం విశేషం. అప్పట్లో టాలీవుడ్ లో “ప్రేమాలయం” అతిపెద్ద మ్యూజికల్ హిట్. “ప్రేమ పావురాలు” చిత్రంతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న సల్మాన్ ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు