సల్మాన్ కి కోపం వచ్చింది..కారణం అదే..!

Published on Mar 27, 2020 8:50 am IST

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కొంచెం సీరియస్ అయ్యారు. ఓ వీడియో ద్వారా ఆయన తన అసహనం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ ప్రభావం అంత కంతకూ పెరుగుతూ పోతున్న నేపథ్యంలో ప్రజల నిర్లక్ష్యాన్ని ఆయన ప్రశ్నించారు. అత్యంత ప్రమాదకరమైన కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకొనే క్రమంలో పోలీస్ మరియు వైద్య సిబ్బంది చేస్తున్న సేవలను కొనియాడిన ఆయన ప్రజల సహకారం కోరారు.

బాధ్యతగా ఉండమన్నాడు. మాస్కులు ధరించండం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు బయట తిరగకుండా ఉండండి అని ఆయన సూచనలు ఇచ్చారు. బాధ్యతగా ఉండి మీ ప్రాణాలతో పాటు, మీ కుటుంబ సభ్యులు, స్నేహితుల ప్రాణాలను కాపాడండి అని చెప్పుకొచ్చారు. ఇది ప్రాణాలతో చెలగాటం జాగ్రత్తగా ఉండండి అని కోరుకున్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

X
More