‘మజిలి’కి సన్నద్ధం అయిన చైతు, సమంత !

‘మజిలి’కి సన్నద్ధం అయిన చైతు, సమంత !

Published on Oct 6, 2018 10:05 AM IST



నిన్ను కోరి’ చిత్రంతో హిట్ కొట్టిన యువ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వవంలో సమంత, నాగ చైతన్య హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇటీవలే ప్రొడక్షన్ కార్యక్రమాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా సమంత, నాగ చైతన్య వచ్చే వారం నుంచి షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. గతంలో ‘ఏమాయచేసావే, ఆటో నగర్ సూర్య, మనం’ చిత్రాలు కలిసి చేసిన చైతు, సమంత పెళ్లి తర్వాత కలిసి నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం.

కాగా ఈ చిత్రం టైటిల్‌ ‘మజిలి’ అంటూ సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్ర దర్శక నిర్మాతలు ఈ టైటిల్ నే ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే మజిలీ టైటిల్ ను రిజిస్టర్ కూడా చేయించారట. ఇక ఈ చిత్రం భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని తెలిపేలా తెరకెక్కనుంది. హిందీ నటి దివ్యంశ కౌశిక్ కీలక పాత్రలో నటించనున్న ఈ చిత్రానికి గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు. సాహు గరపాటి ,హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు