విజయ్ ఫ్యాన్స్ కి సమంత క్షమాపణ!

Published on Feb 1, 2023 3:13 pm IST

యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వం లో తెరకెక్కుతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఖుషీ. ఈ చిత్రం లో స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్ గా నటిస్తుంది. సమంత అనారోగ్యం కారణంగా షూటింగ్ వాయిదా పడిన సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా సమంత సిటాడెల్ కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ తో ఈ సీరిస్ లో నటించనుంది.

అయితే దీంతో ఖుషీ చిత్రం మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో నటి సమంత, అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వడం జరిగింది.ఖుషీ చిత్రం త్వరలోనే పునః ప్రారంభం అవుతుంది అని తెలిపింది. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి క్షమాపణలు అంటూ చెప్పుకొచ్చింది. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. సమంత చేసిన ట్వీట్ వైరల్ గా మారుతోంది. సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది.

సంబంధిత సమాచారం :