ప్రెగ్నెన్సీ వార్తలపై సమంత ఫన్నీ రియాక్షన్

Published on Jun 10, 2019 11:23 pm IST


స్టార్ హీరోయిన్ సమంత తల్లి కాబోతోందనే వార్తలు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వెబ్ మీడియాలో సైతం ఈ సమంత తల్లి కాబోతుందా అంటూ కథనాలు వెలువడ్డాయి. వీటి గురించి విన్న సమంత తీవ్ర స్థాయిలో ఖండించడం, పుకార్లు పుట్టించిన వారిపై మండిపడిపోవడం వంటివి చేయకుండా తనదైన స్టైల్లో ఫన్నీగా స్పందించారు.

నిజంగా సమంత తల్లి కాబోతుందా.. ? మీరు కనుక్కుంటే మాక్కూడా చెప్పండి అంటూ ట్విట్టర్ ద్వారా ఆ వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం సమంత ‘ఓ బేబీ’ అనే సినిమా చేస్తున్నారు. ఆ చిత్ర ప్రమోషన్లలో భాగంగా తన ట్విట్టర్ ఐడీని బేబీ అక్కినేని అని మార్చుకున్నారు. ఇది గమనించిన నెటిజన్లు ఇంతకుముందు ఏ సినిమాకీ ఇలా చేయలేదు. ప్రత్యేకించి ఈ సినిమాకి చేసిందంటే ఏదో విశేషం ఉంది అంటూ చర్చ నడిపి ఈ పుకారుకు ఆద్యం పోశారు. ఇకపోతే నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ‘ఓ బేబీ’ జూలై 5న రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :

More