రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం పై క్లారిటీ ఇచ్చిన సమంత !

Published on Jul 25, 2018 8:46 am IST

ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో కలిసి రాజమౌళి ఓ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ను తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. ‘బాహుబలి’ తరవాత ఆయన చేస్తున్న సినిమా కావడం, ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి రకరకాల ఊహా గానాలు, వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అలాంటి వార్త ఒకటి మంగళవారం సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. వివరాల్లోకి వెళ్తే ‘ఆర్ఆర్ఆర్’లో హీరోయిన్ గా అవకాశం వస్తే సమంత తిరస్కరించారనేది ఈ వార్త సారాంశం.

కాగా ఈ వార్తలో ఎలాంటి నిజం లేదట.ఓ ప్రముఖ పత్రిక ఈ విషయం పై సమంతను సంప్రదించగా.. ఆమె క్లారిటీ ఇస్తూ ‘ఇంతవరకు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ కు సంబంధించి ఎవరూ నన్ను నటించమని సంప్రదించలేదని ఆమె స్పష్టం చేశారు. నేను ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో హీరోయిన్ పాత్రను రిజెక్ట్‌ చేశానని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం అని సమంత తెలిపారు. ఇక ‘ఆర్ఆర్ఆర్’కి సంబంధించి తాజా సమాచారం ప్రకారం ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది. అక్టోబర్ నుంచి చిత్రబృందం సెట్స్ పైకి వెళ్లనున్నారు.

సంబంధిత సమాచారం :