హద్దులు లేని వెబ్ సిరీస్ లలో సమంత నటిస్తుందా…?

హద్దులు లేని వెబ్ సిరీస్ లలో సమంత నటిస్తుందా…?

Published on Jul 13, 2019 1:06 PM IST

పరిశ్రమలో గోల్డెన్ లెగ్ గా పేరున్న సమంత పెళ్లి తరువాత కూడా కెరీర్ ని పరుగులు పెట్టిస్తుంది. ఆమె ప్రధాన పాత్రలో తాజాగా విడుదలైన ‘ఓ బేబీ’ ఘన విజయంతో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది. శర్వానంద్ హీరోగా తమిళ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ ‘96’ రీమేక్‌లో తో పాటు, ఆమె అతిధి పాత్ర చేసిన ‘మన్మథుడు 2’ చిత్రాలు త్వరలో విడుదల కానున్నాయి. ఐతే సమంత పై మరో ఆసక్తికర వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే, ఆమె త్వ‌ర‌లో ఓ వెబ్ సిరీస్‌లో నటించనుందని స‌మాచారం.

అమెజాన్ ప్రైమ్ నిర్మించ‌నున్న ఈ సిరీస్‌లో సామ్ శ‌క్తిమంత‌మైన పాత్ర‌లో న‌టించ‌నుంద‌ని తెలిసింది. ప్ర‌స్తుతం ఈ మేర‌కు క‌థా చ‌ర్చ‌లు కూడా సాగుతున్నాయ‌ని త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కలదని అంటున్నారు. ఇప్పటికే బాలీవుడ్ లో రాధికా ఆప్టే,కైరా అద్వానీ లతో పాటు అనేకమంది తారలు వెబ్ సిరీస్ లలో నటిస్తుండగా, టాలీవుడ్ హీరోయిన్లలో శ్రద్దా దాస్ వంటి చిన్న హీరోయిన్స్ నటించడం జరిగింది.

ఐతే వెబ్ సిరీస్ లపై ఎటువంటి సెన్సార్ ఆంక్షలు లేకపోవడంతో బోల్డ్ కంటెంట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. మరి అలాంటి వెబ్ సిరీస్ లలో నటించడానికి సమంత ఒప్పుకుంటుందా అనేది ఆసక్తికరం. ఐతే అన్ని వెబ్ సిరీస్ లలో హీరోయిన్స్ రోల్ అలా ఉండాలన్న నియమం లేదు. కొన్ని వెబ్ సిరీస్ లు కంటెంట్,పెరఫార్మెన్స్ బేస్డ్ రోల్స్ కూడా ఉంటాయి. మరి ఒకవేళ సమంత వెబ్ సిరీస్ లలో నటిస్తే ఆమె పాత్ర ఎలాఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు