స్టార్ హీరోయిన్ సమంత (Samantha) పుట్టిన రోజు నేడు. తన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు సోషల్ మీడియా వేదిక గా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే అభిమానులను ఆశ్చర్యానికి, ఆనందానికి గురి చేస్తూ, తన కొత్త ప్రాజెక్ట్ కి సంబందించిన అప్డేట్ వెలువడింది. మా ఇంటి బంగారం అనే టైటిల్ తో తన తదుపరి చిత్రం ప్రకటించడం జరిగింది.
ఈ చిత్రం కి సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయగా, అధ్బుతమైన స్పందన వస్తోంది. చీరకట్టులో, మెడలో తాళి ధరించి ఉంది. చేతిలో డబుల్ బ్యారెల్ గన్ తో ఉన్న ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ విశేషం గా ఆకట్టుకుంటుంది. ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై ఈ చిత్రంను నిర్మిస్తున్నారు. దర్శకుడు, నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.