మరోసారి ‘మనం’ దర్శకుడితో సమంత..?

మరోసారి ‘మనం’ దర్శకుడితో సమంత..?

Published on Feb 14, 2015 6:17 PM IST

samantha
విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సమంత తొలిసారిగా నటించిన సినిమా ‘మనం’. అక్కినేని త్రయం నటించిన ఈ సినిమాలో సమంత ద్విపాత్రాభినయం చేసింది. ఆమె నటనకు విమర్శకుల నుండి ప్రసంశలు లభించాయి. తాజాగా మరోసారి విక్రమ్ కుమార్ సినిమాలో నటించడానికి సమంత రెడీ అవుతుందని చెన్నై మీడియా టాక్.

తమిళ స్టార్ సూర్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ’24’ అనే సినిమా రూపొందుతుంది. షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమాలో సూర్య సరసన హీరోయిన్ గా నటించే అవకాశం సమంతకు లభించిందట. 2డి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై హీరో సూర్య స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఏఅర్ రెహమాన్ సంగీత దర్శకుడు.

సూర్యతో ‘సికిందర్’ సినిమాలో మొదటిసారి నటించింది. ఈ సినిమా ఫలితం వీరిద్దరిని కాస్త నిరాశకు గురి చేసింది. ’24’తో హిట్ కొట్టాలని, ఫ్లాప్ సెంటిమెంట్ ముద్రను చేరిపేయాలని భావిస్తున్నారు.

తాజా వార్తలు