సమంత కొత్త ప్రాజెక్ట్‌ల అప్డేట్స్ దసరాకి రాబోతున్నాయా?

Published on Oct 14, 2021 1:36 am IST


సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే సమంత నాగచైతన్యతో విడిపోయిన తర్వాత పెద్దగా యాక్టివ్‌గా ఉండడంలేదు. అయితే అక్టోబర్ 15న దసరా సందర్భంగా సమంత కొత్త ప్రాజెక్టుల గురించి ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాతగా కొత్త దర్శకుడు చెప్పిన కథకు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అలాగే ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ దర్శకుడు రాజ్ డీకేతో మరోసారి పనిచేయబోతున్నట్టు తెలుస్తుంది.

అయితే ఇవే కాకుండా ఓ బాలీవుడ్ సినిమాకు కూడా సమంత ఓకే చెప్పినట్టు టాక్ వినిపిస్తుంది. వీటికి సంబంధించిన వివరాలను సమంత దసరా సందర్భంగా వెల్లడించబోతుందట. ఇదిలా ఉంటే గుణశేఖర్ దర్శకత్వంలో సమంత నటించిన ‘శాకుంతలం’, తమిళంలో ‘కాతు వాకుల రెండు కాదల్’ సినిమాలు విడుదలకు సిద్దమవుతున్నాయి.

సంబంధిత సమాచారం :