సమంత ఆ సినిమాలో నటించట్లేదు !

Published on Feb 26, 2020 1:00 am IST

స్టార్ హీరోయిన్ సమంత వరుస విజయాలతో తన కెరీర్ ను విజయవంతంగా కొనసాగిస్తోంది. అయితే స‌మంత – శ‌ర్వానంద్‌ కాంబినేషన్ లో వచ్చిన ‘జాను’ మాత్రం సమంత విజయాల పరంపరకు బ్రేక్ పడేలా చేసింది. ప్రస్తుతం సమంత విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కనున్నసినిమాలో నటిస్తోంది. దర్శకుడు అశ్విన్ శరవణన్ తెరెకెక్కించనున్న ఈ సినిమాలో నయనతార కూడా సమంతతో కలిసి నటిస్తోంది. ఐతే సమంత మరో తమిళ ప్రాజెక్ట్ జీన్స్ ఫేమ్ ప్రశాంత్ హీరోగా రాబోతున్న సినిమాలో కూడా నటించడానికి అంగీకరించిందని కొన్ని రోజులుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే.

అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం సమంత, ప్రశాంత్ సినిమాలో నటించట్లేదు అట. సోషల్ మీడియాలో వస్తోన్న వార్త కేవలం రూమర్ అని తెలుస్తోంది. అన్నట్టు సమంత రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి మాట్లాడుతూ.. ‘నేను నా కుటుంబం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే నేను రెండు మూడు సంవత్సరాలు కన్నా ఎక్కువ నటించకపోవచ్చు’ అని సమంత తెలిపింది. దీన్ని బట్టి సమంత మరో రెండు సంవత్సరాలు మాత్రమే సినిమాలు చేయనుంది.

సంబంధిత సమాచారం :

X
More