స్టార్ హీరోల రికార్డు ని సమంత సోలోగా కొట్టింది.

Published on Jul 24, 2019 4:02 pm IST

ఓవర్ సీస్ పరంగా అమెరికా భారత చిత్రాలకు అతిపెద్ద మార్కెట్. ప్రవాస భారతీయులు అధికంగా ఉండే అమెరికా లో తెలుగు చిత్రాలకు మంచి ఆదరణ ఉంది. స్టార్ హీరోల హిట్ మూవీస్ అక్కడ మిలియన్ డాలర్స్ వసూళ్లు సాధిస్తాయి. ఐతే చిన్నపాటి ఓ రేంజ్ హీరోలకు కూడా యూఎస్ లో మిలియన్ డాలర్స్ అంత సులభమైన విషయం కాదు. అలాంటిది సమంత సోలోగా ఆ ఘనత సాధించి ఆశ్చర్య పరిచింది.

ఇటీవల నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత నటించిన “ఓ బేబీ” విజయం సొంతం చేసుకుంది. ఈ మూవీ కి విమర్శకుల ప్రశంసలతో పాటు, కమర్షియల్ గా మంచి వసూళ్లు కూడా దక్కాయి.ఐతే యూఎస్ లో కూడా ఈ మూవీకి అద్భుత ఆధరణ దక్కింది. అక్కడ సమంత “ఓ బేబీ” మిలియన్ డాలర్ వసూళ్లు సాధించి అందరిని ఆశ్చర్య పరిచింది. మొదటి షో నుండే హిట్ టాక్ తో దూసుకెళ్లిన ఓ బేబీ యూఎస్ లో కూడా రికార్డు వసూళ్లు సాధించింది . ఈ సినిమాకు మిలియన్ డాలర్ వసూళ్లు రావడంతో ప్రస్తుతం యూనిట్ సంబరాలు చేసుకుంటోంది. హీరోలకు సైతం సవాలు విసిరే ఈ ఛాలెంజ్ ని సమంత సోలోగా కొట్టి చూపించింది.

సంబంధిత సమాచారం :