ఊహించని రేంజ్ లో సమంత ‘ఓబేబీ’ నైజాం కలెక్షన్స్.

Published on Jul 9, 2019 12:33 pm IST

సమంత ప్రధాన పాత్రలో లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి తెరకెక్కించిన కామెడీ ఎమోషనల్ ఎంటర్టైనర్ “ఓ బేబీ” విడుదలైన మొదటి రోజునుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని సూపర్ హిట్ దిశగా దూసుకుపోతుంది. వృద్ధురాలు యంగ్ లేడీగా మారిపోతే ఎలాఉంటుందనే ఫాంటసీ కథను ఎమోషనల్ గా తెరకెక్కించి నందిని రెడ్డి ప్రశంసలు అందుకున్నారు. అలాగే సమంత కెరీర్ బెస్ట్ యాక్టింగ్,బెస్ట్ మూవీ గా “ఓ బేబీ” నిలిచిపోవడం ఖాయం అంటున్నారు.

వసూళ్ల పరంగా కూడా ఓ బేబీ అన్ని ఏరియాలలో దూసుకుపోతుంది. ముఖ్యంగా నైజాం ఏరియాలో సమంత ఓ బేబీ చిత్ర వసూళ్లు అంచనాలు మించి ఉన్నాయి. వారాంతంలో ఈ మూవీ వసూళ్లు మొదటి రోజుకు మించి రావడం అనేది స్పష్టమైన విజయానికి నిదర్శనం. మొదటి రోజు 60లక్షల షేర్ వసూలు కాగా,అది శనివారానికి 75 లక్షలకు పెరిగింది. ఆశ్చర్యంగా ఆదివారం 97లక్షలు వసూలు చేసి మొదటి రోజుకంటే దాదాపు 27లక్షల ఎక్కువ రాబట్టింది. ఇక వర్కింగ్ డే సోమవారం ఈ మూవీ 38లక్షల షేర్ రాబట్టి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది.

సంబంధిత సమాచారం :

More