సమంత ఈ సారి ప్రత్యేక పాత్రలో !

Published on Apr 3, 2019 9:05 am IST

వరుస ఆఫర్ల తో ఫుల్ బిజీగా వుంది సమంత అక్కినేని. ప్రస్తుతం ఆమె నటించిన రెండు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అందులో మజిలీ ఈనెల 5న విడుదలకానుండగా ఓ బేబీ మే లో రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాల తరువాత 96 తెలుగు రీమేక్ లో నటించనుంది. ఇక ఇప్పుడు ఒక స్పెషల్ రోల్ చేయడానికి ఓకే చెప్పిందట సమంత. అది ఎవరి సినిమానో కాదు తన మామ కింగ్ నాగార్జున నటిస్తున్న ‘మన్మథుడు 2’. ఈ చిత్రంలో సమంత ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. ఆమె రోల్ సినిమాకు కీలకం కానుందట.

ఇటీవలే ఈ చిత్రం యొక్క మొదటి షెడ్యూల్ హైదరాబాద్లో స్టార్ట్ అయ్యింది. ‘చి ల సౌ’ తో డైరెక్టర్ గా మారి డీసెంట్ హిట్ అందుకున్న యాక్టర్ కం డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో నాగ్ కు జోడిగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది.

సంబంధిత సమాచారం :