ఆత్మగా నటించనున్న సమంత !
Published on Apr 20, 2017 8:40 am IST


ఓంకార్ డైరెక్ట్ చేసిన హర్రర్ చిత్రం ‘రాజుగారి గది’ మంచి సక్సెస్ ను అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా ‘రాజుగారి గది 2’ తెరకెక్కుతోంది. అక్కినేని నాగార్జున, స్టార్ హీరోయిన్ సమంతలు నటిస్తుండంతో ఈ సీక్వెల్ పెద్ద ప్రాజెక్ట్ గా నిలిచింది. సినిమాలో వీరిద్దరి పాత్రలపై అందరిలోనూ అమితాశక్తి నెలకొంది. తాజాగా సినీ సర్కిల్స్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఇందులో సమంత ఒక ఆత్మ పాత్రలో నటిస్తోందట.

ఏ పాత్ర సినిమాకు చాలా ముఖ్యమైనదని, కథ మొత్తం ఆమె ఆ ఆత్మ పాత్ర చుట్టూనే తిరుగుతుందని తెలుస్తోంది. అలాగే నాగార్జునకు, సమంతకు మధ్య నడిచే సన్నివేశాలు సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని అంటున్నారు. పివిపి సినిమా, మ్యాటనీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో శీరత్ కపూర్ నాగార్జునకు జోడీగా నటిస్తోంది.

 
Like us on Facebook