స్టార్ బ్యూటీ సమంత మెయిన్ లీడ్ లో దర్శకురాలు నందిని రెడ్డి కాంబినేషన్లో చేసిన అవైటెడ్ యాక్షన్ ఫ్యామిలీ డ్రామానే మా ఇంటి బంగారం. టీజర్, గ్లింప్స్ లతో మంచి బజ్ రేకెత్తించిన ఈ సినిమా ఇప్పుడు థియేటర్లులో ప్రపంచ వ్యాప్తంగా విడుదలకి సిద్ధం కాగా సమంత మాత్రం తన స్టార్ పవర్ మరోసారి చూపిస్తుంది అని చెప్పాలి.
గతంలో తన సోలో సినిమా యశోద కి ఏ రీతిలో ప్రీ సేల్స్, ఓపెనింగ్స్ రెస్పాన్స్ అందుకుందో ఇప్పుడు మా ఇంటి బంగారం కి కూడా అదే రీతిలో రెస్పాన్స్ కనిపిస్తుండడం విశేషం. యూఎస్ మార్కెట్ లో ఆల్రెడీ 3 లక్షల డాలర్స్ మార్క్ ని దాటేసింది. అలానే తెలుగు స్టేట్స్ లో కూడా బుకింగ్స్ ట్రెండింగ్ లో కనిపిస్తున్నాయి. సో కొంచెం గ్యాప్ వచ్చినా సమంత మాత్రం మాస్ చూపిస్తుంది అని చెప్పాలి. ఇక ఈ సినిమాకి సామ్ భర్త రాజ్ నిడుమోరు కథ అందించగా సమంత నిర్మాణం వహించింది.


