మరో సారి బయపెట్టనున్న సమంత

Published on Feb 26, 2020 10:54 pm IST

హీరోయిన్ గా పదేళ్లు పూర్తిచేసుకున్న సమంత టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతుంది. ఈ పదేళ్ల కాలంలో ఆమె అందరు స్టార్ హీరోస్ సరసన నటించింది. గత ఏడాది ఓ బేబీ సినిమాతో భారీ సోలో హిట్ కొట్టిన సమంత లేటెస్ట్ గా జాను చిత్రంలో జానకిగా మెప్పించింది. కాగా సమంత ప్రస్తుతం రెండు తమిళ చిత్రాలు చేస్తుంది.

విగ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్న కాదూవాకుల రెండు కాదల్ చిత్రంలో నటిస్తుంది. ఈ మూవీలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తుండగా నయనతార మరో హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే స్నేహ భర్త ప్రసన్న హీరోగా అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కూడా సమంత నటిస్తుంది. ఐతే ఈ చిత్రం హారర్ థ్రిల్లర్ అట. అలాగే హారర్ మించిన చాల థ్రిల్స్ ఈ చిత్రంలో ఉన్నాయని సమంత చెవుతుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సివుంది. గతంలో సమంత రాజుగారి గది 2 అనే హారర్ చిత్రంలో నటించింది.

సంబంధిత సమాచారం :