కొత్త బ్రాండ్ కి ప్రచారం చేయనున్న సమంత

Samantha
గతకొన్నాళ్ళుగా టాలీవుడ్ లో నెంబర్ 1 పొజిషన్ లో కొనసాగుతున్న తార సమంత. ఈ భామ చాలా కంపనీలకు ప్రచారకర్తగా నిలిచింది. ఇప్పుడు ఆ జాబితాలో మరో కంపనీ వచ్చిపడింది. న్యుట్రోజీనా అనే స్కిన్ కేర్ కంపనీ సమంతతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని సమంతా ట్విట్టర్ ద్వారా తెలిపింది.

ప్రస్తుతం ఈ భామ చేతినిండా సినిమాలతో రోజంతా కష్టపడుతుంది. ఈ ఏడాది సమంతా ‘రభస’, ‘అల్లుడు శ్రీను’ సినిమాలో కనిపించనుంది. బెంగుళూరు డేస్ రీమేక్ లో కూడా ఈ భామ నటిస్తుందని సమాచారం.

మనం సినిమా విజయం తరువాత సమంతకి ఆటోనగర్ సూర్య తో ఒక యావరేజ్ సినిమాని లిస్టులో వేసుకుంది. మరి సమంతాకి మిగిలిన సినిమాలు విజయం సాధించాలని కోరుకుందాం.

Exit mobile version