మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా షూటింగ్ కి తిరిగి రావడం అంటే నాకు ఇంట్లో ఉన్నట్టే అనిపిస్తుంది. అంటూ ట్వీట్ చేసింది హీరోయిన్ సమంత. ప్రస్తుతం ఈ చెన్నై సుందరి త్రివిక్రమ్ దర్శకత్వంలో రెండో సారి నటిస్తుంది. ‘అత్తారింటికి దారేది’ సినిమాలో సమంత త్రివిక్రమ్ తో కలసి తొలిసారి పనిచేసింది. ఆ చిత్రంలో ఆమె నటనకు మంచి పేరొచ్చింది. అదే సమయంలో త్రివిక్రమ్ కు పెద్ద ఫ్యాన్ అయిపొయింది.
అల్లు అర్జున్ సరసన తొలిసారిగా సమంత నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. ప్రధాన తారాగణంపై త్రివిక్రమ్ కామెడీ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత షూటింగ్ ఊటీకి షిఫ్ట్ అవుతుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.


