సరైన వాళ్లనే టార్గెట్ చేసిన సమంత !

Published on Jun 9, 2019 3:00 pm IST


ఒక సినిమా సూపర్ హిట్ అయిందంటే దాని వెనకే ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణ తప్పకుండా ఉంది తీరుతుంది. చాలామంది దర్శకులు, రచయితలు తమ సినిమాల్లో కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే ఎంటర్టైన్మెంట్, సెంటిమెంట్ ఉండేలా చూసుకుంటుంటారు. ఈమధ్యకాలంలో ఫామిలీ ఆడియన్స్ ఆదరణను ఎక్కువగా దక్కించుకున్న చిత్రం ‘ఎఫ్ 2’. ఆ ఇస్నిమయా ఏ స్థాయి విజయాన్ని సాధించిందో అందరం చూశాం. అందుకే సమంత ఈసారి వాళ్లనే టార్గెట్ చేశారు.

ప్రస్తుతం సమంత నటించిన ‘ఓ బేబీ’ పోస్టే ప్రొడక్షన్ దశలో ఉంది. జూలై 5న చిత్రం రిలీజ్ కానుంది. ఈ సినిమాలో మంచి ఎంటర్టైన్మెంట్, భావోద్వేగాలు మెండుగా ఉంటాయట. ఈ విషయాన్ని స్వయంగా సమంత తెలిపారు. ట్రైలర్ కంటెంట్ చూస్తే ఆమె ఎందుకలా అన్నారో అర్థమవుతుంది. సినిమా విడుదలయ్యాక అందులోని కంటెంట్ సమంత చెప్పినట్టు కుటుంబ ప్రేక్షకులకి కనెక్ట్ అయిందంటే ‘ఓ బేబీ’ భారీ హిట్ కొట్టడం ఖాయం. నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి
మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :

More