నాగ చైతన్యను బీట్ చేయనున్న సమంత

Published on Jul 14, 2019 1:34 pm IST

స్టార్ హీరోయిన్ సమంత నటించిన తాజా చిత్రం ‘ఓ బేబీ’ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. మొదటిలో షో నుండే చిత్రానికి హిట్ టాక్ వచ్చింది. ఓవర్సీస్లో అయితే ప్రీమియర్లతోనే చిత్రం హిట్ అని తేలిపోయింది. ప్రీమియర్ల ద్వారా 145,637 డాలర్లను రాబట్టుకున్న ఈ చిత్రం శుక్రవారం 152,716 డాలర్లను, శనివారం 150,006 డాలర్లను వసూలు చేసింది. ట్రేడ్ వర్గాల లెక్కల మేరకు ఇప్పటి వరకు మొత్తంగా 750,000 వసూలైనట్టు తెలుస్తోంది.

అంటే ఇంకో రెండు రోజుల్లో ఈ మొత్తం మిలియన్ మార్క్ తాకనుంది. అంతేకాదు ఈ వసూళ్లతో సమంత తన భర్త, హీరో నాగ చైతన్య వసూళ్లను బీట్ చేయనుంది. చైతన్య హిట్ చిత్రాలైన ‘ప్రేమమ్’
మొత్తంగా 829,098 డాలర్లను, ఇటీవలే విజయాన్ని అందుకున్న ‘మజిలీ’ 800,200 డాలరర్లను రాబట్టగా.. సమంత ‘ఓ బేబీ’తో ఆ వాటిని క్రాస్ చేయనుంది.

సంబంధిత సమాచారం :

X
More