సమంత నానితో మళ్లీ చేస్తోందా ?

Published on Apr 1, 2019 8:50 pm IST

సమంత నానితో కలిసి ‘ఈగ’ ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా ‘ఎటో వెళ్లిపోయింది మనసు’లో ఈ జంట బాగానే స్క్రీన్ రొమాన్స్ పండించింది. కాగా తాజగా ఈ జంట మళ్లీ మరో సినిమాలో కలిసి నటించబోతున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ తన తరువాత సినిమాని నాని, సుదీర్ బాబు ప్రధాన పాత్రల్లో చేయనున్న విషయం తెలిసందే. ఈ సినిమాకు ‘వ్యూహం’ అనే టైటిల్ పెట్టబోతున్నట్లు సమాచారం.

కాగా ఈ చిత్రంలో నాని పక్కన సమంత అయితేనే బాగుంటుందని చిత్రబృందం భావిస్తోందట. ఆ మేరకు త్వరలోనే ఆమెను సంప్రదించనున్నారు. మరి సమంత ఈ సారి నాని సరసన నటిస్తోందో లేదో చూడాలి.

ఇక ఈ సినిమా థ్రిల్లర్‌ అంశాలతో సాగుతుందని.. సినిమాలోని నానికి సుధీర్ బాబు కి మధ్య వచ్చే సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయట. అయితే ఇప్పటికే స్క్రిప్ట్ పూర్తి చేసిన ఇంద్రగంటి.. త్వరలో సినిమాను మొదలుపెట్టడానికి రెడీ అవుతున్నాడు. దిల్ రాజు నిర్మించనున్నారు.

సంబంధిత సమాచారం :