
మాతృభాష తమిళంలో వరుస పరాజయాలు ఎదుర్కొన్న సమంత ‘కత్తి’ సినిమా కమర్షియల్ సక్సెస్ తో ఊపిరి పీల్చుకుంది. ఇళయ దళపతి విజయ్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించింది. తమిళంలో తనకు కమర్షియల్ బ్రేక్ ఇచ్చిన లక్కీ హీరో విజయ్ సరసన మరో సినిమాలో సమంత నటించనుందట. విజయ్ కెరీర్లో ‘కత్తి’ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. హిట్ కాంబినేషన్ రిపీట్ కానుందనే వార్త హీరో అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తుంది.
ప్రస్తుతం విజయ్ ‘పులి’ సినిమాలో నటిస్తున్నారు. ఇది పూర్తయిన తర్వాత ‘రాజా రాణి’ ఫేం అట్లీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించడానికి అంగీకరించారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. మెయిన్ హీరోయిన్ గా సమంతను తీసుకోమని దర్శక నిర్మాతలకు హీరో విజయ్ సూచించారట. బ్రిటిష్ మోడల్ అమీ జాక్సన్ మరొక హీరోయిన్ గా ఎంపిక చేసినట్టు సమాచారం.

