శర్వా కు జోడిగా సమంత ?

శర్వా కు జోడిగా సమంత ?

Published on Dec 18, 2018 4:00 AM IST

కథాబలం వున్న చిత్రాల్లో మాత్రమే నటిస్తూ సెలక్టీవ్ గా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు హీరో శర్వానంద్. ప్రస్తుతం ఆయన నటించిన ‘పడి పడి లేచె మనసు’ విడుదలకు సిద్ధమైంది. ఇక ఈచిత్రం తరువాత శర్వా తమిళ సూపర్ హిట్ మూవీ ’96’లో నటించనున్నాడట. లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈచిత్రం ఈ ఏడాది అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

దిల్ రాజు ఈచిత్రం యొక్క తెలుగు హక్కులను దక్కించుకున్నారు. ఇక ఈ చిత్రంలో శర్వా కు జోడిగా సమంత నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఒరిజినల్ వర్షన్ కు దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమారే ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడట. తర్వలోనే ఈచిత్రానికి సంబందించిన క్యాస్ట్ అండ్ క్రూ గురించి అధికారిక ప్రకటన వెలుబడనుంది.

ఇక ఈచిత్రం అటు కన్నడ లో కూడా రీమేక్ అవుతుంది. గోల్డెన్ స్టార్ గణేష్ ,భావన జంటగా ’99’ పేరుతో ప్రీతమ్ గబ్బి ఈచిత్రాన్ని రీమేక్ చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు