మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో నటించాలనుంది అంటూ తన కోరికను ట్విట్టర్ లో వెల్లడించింది డస్కీ బ్యూటీ సమంత. రామ్ చరణ్ – సమంతను జంటగా చూడాలని ఉంది. ఈ కాంబినేషన్ లో సినిమా రావడానికి ఇంకెన్ని రోజులు పడుతుంది..? అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు బదులుగా మీ టూ అంటూ రిప్లై ఇచ్చింది సమంత. ఈ వ్యాఖ్యల అర్ధం ‘చరణ్ తో సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను’ అనే కదా.
ప్రస్తుతం అల్లు అర్జున్ – తివిక్రమ్ కలయికలో రూపొందుతున్న సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది. ఆల్రెడీ ‘అత్తారింటికి దారేది’ సినిమాలో పవన్ కళ్యాణ్ తో జోడి కట్టింది. త్వరలో రామ్ చరణ్ సరసన కూడా నటించే అవకాశం వస్తుందని ఆశిద్దాం..!


