సమంత ఈసారి భయపెడుతుందట

Published on Feb 27, 2020 2:17 pm IST

కొన్నేళ్ళుగా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలే చేస్తున్న సమంత ఇకపై కూడా అలాంటి సినిమాలే చేయనున్నారు. తమిళంలో ఇప్పటికే విజయ్ సేతుపతితో కలిసి నటిస్తున్న ఆమె ఇటీవలే ‘గేమ్ ఓవర్’ ఫేమ్ అశ్విన్ శరవణన్ డైరెక్షన్లో ఒక చిత్రం చేయడానికి ఒప్పుకున్నారు. ఇందులో సమంతతో పాటు ప్రసన్న ప్రధాన పాత్ర పోషించనున్నారు.

ఈ చిత్రం పూర్తిగా హర్రర్ జానర్లో ఉంటుందని తెలుస్తోంది. అశ్విన్ శరవణన్ గత చిత్రాలు ‘గేమ్ ఓవర్, మాయ’లు కూడా హర్రర్ చిత్రాలే. ఈ రెండూ మంచి విజయాన్ని అందుకున్నాయి. అందుకే సమంత చిత్రంపై అంచనాలు బాగా పెరిగాయి. సమంతకు కూడా హర్రర్ జానర్లో సినిమాలు కొత్తేమీ కాదు. గతంలో ‘రాజుగారి గది 2, యు టర్న్’ లాంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. మరి ఈసారి ఆమె చేయబోతున్న హర్రర్ కథ ఎలా భయపెడుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More