సమంత – నాగచైతన్య విడిపోయాక సామ్ ఒంటరిగానే ఉంటుంది. అయితే, సమంత రెండో పెళ్లి పై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ గురించి తెలిసిందే. తాజాగా ఈ వార్త పై మళ్లీ రూమర్ వైరల్ అవుతుంది. సమంత రెండో పెళ్లికి సిద్ధమవుతుందని, తన బాయ్ ఫ్రెండ్ రాజ్ నిడుమోరుతో ఆమె పెళ్లి పీటలు ఎక్కబోతుందని టాక్ నడుస్తోంది. వీరిద్దరూ కలిసి నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దీంతో ఈ రూమర్ కి బలం చేకూర్చినట్లు అయింది.
పైగా, ఇప్పటికే వారిద్దరూ డేటింగ్లో ఉన్నారని, మే నెలలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారని కొత్తగా గాసిప్ వినిపిస్తోంది. అన్నట్టు సామ్ – రాజ్ పెళ్లికి ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇటు సమంతగానీ, అటు రాజ్గానీ స్పందించలేదు. ఇక సమంత నిర్మాతగా వ్యవహరించిన ‘శుభం’ సినిమాలో అంతా కొత్తవారే నటించారు. నటిగా తన కెరీర్ మొదలు పెట్టిన సమయంలో యాక్టింగ్ గురించి తనకు పెద్దగా తెలియదన్నారు సమంత. ‘శుభం’ సినిమాలో నటీనటులు బాగా చేశారని సామ్ చెప్పింది.