సమంత రెండు చిత్రాలు ఒకే రోజు విడుదలకానున్నాయి !

Published on Aug 3, 2018 2:45 pm IST

ఈ ఏడాది వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరోయిన్ సమంత అక్కినేని ప్రస్తుతం ఆమె నటించిన రెండు చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. దాంట్లో మొదటిది తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న థ్రిల్లర్ మూవీ ‘యు టర్న్’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈచిత్రం సెప్టెంబర్ 13న రెండు భాషల్లో ఒకే సారి విడుదల కానుంది. ఈ పవన్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈచిత్రంలోసమంత జర్నలిస్ట్ పాత్ర లో కనిపించనుంది. భూమిక , అది పినిశెట్టి , రాహుల్ రవీంద్రన్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈచిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకం ఫై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు.

ఇక రెండవ చిత్రం పొనరం దర్శకత్వంలో శివ కార్తికేయన్ , సమంత జంటగా తమిళ భాషలో తెరకెక్కుతున్న ‘సీమ రాజా’. ఈ చిత్రం కూడా సెప్టెంబర్ 13న తమిళ ప్రేక్షకుల ముందుకు రానుంది. యాక్షన్ ఎంటరైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు. 24 ఎఎం స్టూడియోస్ పతాకం ఫై ఆర్ డి రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More