రాజ్ కందుకూరి చేతుల మీదుగా ‘స‌మ‌రం’ ట్రైల‌ర్‌ విడుదల.

Published on Nov 30, 2019 1:25 pm IST

సాగ‌ర్ గంధం, ప్ర‌గ్యా న‌య‌న్ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం `స‌మ‌రం`. యూనివ‌ర్స‌ల్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై బ‌షీర్ ఆలూరి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీనివాస్ వీరంశెట్టి, జీవీఎస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్రైమ్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం ప్ర‌స్తుతం సెన్సార్‌కి సిద్ధ‌మైంది. ఈ సినిమా ట్రైల‌ర్‌ను ప్ర‌ముఖ నిర్మాత రాజ్ కందుకూరి విడుద‌ల చేసి చిత్ర యూనిట్‌కు అభినంద‌న‌లు తెలిపారు. అన్ని క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులను మెప్పించేలా సినిమా ఉంటుంద‌ని, డిసెంబ‌ర్ నెల‌లో సినిమాను విడుద‌ల చేయాల‌నుకుంటున్నాం, త్వ‌ర‌లోనే సినిమా విడుద‌ల తేదీని ప్ర‌క‌టిస్తామ‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు తెలియ‌జేశారు.

ఆడవాళ్లపై అకృత్యాలకు పాల్పడే క్రైమ్ గ్యాంగ్ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న నేరాలను తెలియజేస్తూ ఓ సామాజిక సందేశంతో సమరం తెరకెక్కింది. క్రైమ్ తో పాటు మంచి లవ్ ట్రాక్ కూడా ఈ చిత్రంలో ఉంటుందని సమాచారం.రాజ్ కిరణ్ మ్యూజిక్ అందిస్తుండగా సుమ‌న్‌, వినోద్ కుమార్‌, స‌త్య‌ప్రకాష్‌, జ‌హీదా, ప్రియాన్షు, స‌హ‌నా, వేణుగోపాల్ త‌దిత‌రులు నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :