ఆ హీరోయిన్‌కు కూతురు పుట్టింది

Published on Jul 12, 2019 9:00 pm IST

ఒకప్పటి అందాల కథానాయిక సమీరా రెడ్డి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంతోషాన్ని ఆమె ఇన్స్టాగ్రమ్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది. ఈరోజు ఉదయమే లిటిల్ ఏంజెల్ వచ్చింది. మీ అందరి ప్రేమకు, ఆశీర్వాదానికి ధన్యవాదాలు అంటూ పోస్ట్ పెట్టింది. అంతేకాదు కుమార్తె చేతిని చేతిలో పెట్టుకుని ఫోటో కూడా పెట్టింది.

తెలుగు, తమిళం, హిందీ పరిశ్రమల్లో పలు హిట్ చిత్రాలు చేసిన సమీరా 2014లో వ్యాపారవేత్త అక్షయ్ వార్దేని వివాహమాడారు. వారికి 2015లో ఒక మగ బిడ్డ జన్మించగా ఈరోజు ఉదయం ఆడ బిడ్ద జన్మించింది. ఈ విషయం తెలిసిన ప్రముఖులు ఆమెకు, ఆమె భర్తకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

సంబంధిత సమాచారం :

X
More