పాప నా లాగా నల్లగా లేదు – సమీరా రెడ్డి

Published on Jul 15, 2019 4:00 pm IST

మాజీ హీరోయిన్ సమీరా రెడ్డి కొన్నేళ్ల నుండీ సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా.. ఈ మధ్య సోషల్ మీడియాలో మాత్రం తరుచూ కనిపిస్తూ.. పైగా ఫోటో షూట్ లతోబాగానే హడావుడి చేస్తోంది. అయితే కొన్ని రోజుల క్రితం సమీరా రెడ్డి రెండవ కాన్పులో పండంటి ఆడబిడ్డకు జన్మనించింది. కాగా కాన్పు తర్వాత ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన బిడ్డ పోలికల గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. సమీరా రెడ్డి చేసిన కామెంట్స్ పై ప్రస్తుతం సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.

ఇంతకీ సమీరా రెడ్డి మాట్లాడుతూ.. తొలి ఏకాదశి రోజు మా ఇంట్లోకి పండంటి ఆడబిడ్డ ప్రవేశించింది.. ఇక నాకు ఇప్పటికే చాలా కానుకలు వచ్చాయి. ఆ కానుకలు చూస్తుంటే.. మా పాప కోసం ఇప్పట్లో నేను షాపింగ్ చేయాల్సిన అవసరం లేదు అని సమీరా రెడ్డి చెప్పుకొచ్చింది. అయితే సమీరాను పాప ఎవరి పోలిక అని అడిగితే.. ఈ సందర్భంగా సమీరా పాప గురించి చెప్తూ.. పాప తెల్లగా ముద్దొచ్చేలా ఉంది. నా లాగా నల్లగా లేదు. అని కామెంట్ చేసింది. పోలిక గురించి అడిగితే.. రంగు గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముందని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More