పెళ్లి విషయంలో చాలా బాధ పడిందట

Sameera Reddy

మాజీ హీరోయిన్ సమీరా రెడ్డి ఒకప్పుడు తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ స్టేటస్ అనుభవించింది. పైగా దక్షిణాదిన పలువురు యువ, స్టార్ హీరోలతో సినిమాలు చేసి.. అటు నుండి బాలీవుడ్ పోయి, అక్కడా కొన్ని సినిమాల్లో కనిపించి మొత్తానికి హీరోయిన్ గా సక్సెస్ అయింది. అయితే, పెళ్లి చేసుకున్న తర్వాత సమీరా రెడ్డి సినిమాలకు దూరమయ్యారు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం అభిమానులను పలకరిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

తన పెళ్లి విషయంలో కొందరు చేసిన విమర్శలు తనకు చాలా బాధను కలిగించాయని ఆమె తెలిపారు. ‘‘2014లో అక్షయ్‌తో నా పెళ్లి జరిగింది. మా ఇంటి టెర్రస్‌పైనే సింపుల్‌గా చేసుకున్నాం. నేను ప్రెగ్నెంట్ అయ్యానని, అందుకే హడావుడిగా పెళ్లి చేసుకున్నానని కొందరు కామెంట్స్ చేశారు. నిజానికి ఆ కామెంట్స్ లో ఏ మాత్రం నిజం లేదు. పెద్దల అంగీకారంతోనే మా వివాహం జరిగింది” అని సమీరా రెడ్డి చెప్పుకొచ్చింది. అలాగే తాను తొలి ప్రెగ్నెన్సీ సమయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాను అని సమీరారెడ్డి చెప్పారు.

Exit mobile version