వైరల్ అవుతున్నఒకప్పటి ఎన్టీఆర్ హీరోయిన్ ఓల్డ్ ఫోటో

Published on May 16, 2019 7:50 pm IST

సమీరా రెడ్డి ప్రెగ్నెంట్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె తాజాగా వార్తలలో నిలచింది. ఒకప్పుడు బాలీవుడ్ మరియు టాలీవుడ్ ఇండస్ట్రీలతో పాటు తమిళ ఇండస్ట్రీలో కూడా టాప్ హీరోయిన్గా వెలుగొందిన సమీరా పెళ్లి తరువాత సినిమాలకు దూరమైపోయింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న సమీరా పెళ్లి, ప్రెగ్నెన్సీ వలన తన శరీరంలో వచ్చిన మార్పులు, సినిమా అవకాశాలు వంటి అనేక విషయాలపై ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టారు.

నిలువెత్తు అందంతో సన్నజాజితీగలా ఉండే సమీరా పెళ్లి తరువాత గుర్తు పట్టంలేనంత లావుగా మారిపోయింది. తాజాగా సమీరా తన ఇన్స్ట్రాగ్రామ్ ఖాతాలో తను సూపర్ గ్లామరస్ గా ఉన్నప్పటి ఓ ఓల్డ్ ఫోటో ని పోస్ట్ చేసి కింద “హూ ది హెల్ ఈజ్ దిస్ చిక్” అని కాప్షన్ కూడా యాడ్ చేసింది . ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం :

More