పవన్‌పై అభిమానం చాటుకున్న సంపత్!

పవన్‌పై అభిమానం చాటుకున్న సంపత్!

Published on Dec 11, 2015 1:00 PM IST

Pawan-and-Sampath-Nandi
‘ఏమైంది ఈ వేళ’, ‘రచ్చ’ లాంటి హిట్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు సంపత్ నంది తాజాగా రవితేజ హీరోగా ‘బెంగాల్ టైగర్’ అనే సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. భారీ ప్రమోషన్స్‌తో క్రేజీగా మారిపోయిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నిన్న పెద్ద ఎత్తున విడుదలైంది. ఇక ఈ సినిమాకు అన్నిచోట్లా మొదటిరోజు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా రవితేజ మార్క్ కామెడీకి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఇదిలా ఉంటే.. బెంగాల్ టైగర్ సినిమా విషయంలో ఒక అంశం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అదే ఈ సినిమాలో అక్కడక్కడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావించడం.

నిజానికి ‘రచ్చ’ సినిమా తర్వాత సంపత్ నంది పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్ 2’కు దర్శకత్వం వహించాలి. కాగా అనుకోని కారణాల వల్ల సంపత్ నంది చేతులనుండి ఆ అవకాశం చేజారింది. ఇక్క అప్పట్నుంచే పవన్ కళ్యాణ్, సంపత్ నందిలకు మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయని, అందువల్లే సినిమా ఆగిపోయిందనే ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేమీ లేదని, పవన్ కళ్యాణ్‌తో మంచి సంబంధాలు ఉన్నాయని, గబ్బర్ సింగ్ 2 కొన్ని ఇతర పరిస్థితుల వల్లే ఆగిపోయిందని చెప్పుకొచ్చారు.

తాజాగా ఇదే విషయాన్ని తన సినిమా బెంగాల్ టైగర్ ద్వారాను సంపత్ నంది పరోక్షంగా చెప్పినట్లు చూడొచ్చు. ‘సౌతిండియాలో రజనీకాంత్ స్థాయి స్టార్ రాలేడన్నారు, పవన్ కళ్యాణ్ రాలా?’ అంటూ వచ్చే ఓ డైలాగ్‌తో పాటు పలు ఇతర సన్నివేశాల్లోనూ పవన్ కళ్యాణ్ ప్రస్తాన తెచ్చి తనకు పవన్ అంటే ఎంతిష్టమో మరోసారి చెప్పారు సంపత్ నంది. ఇక ఈ సన్నివేశాలకు పవన్ అభిమానుల నుండి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు