చార్మింగ్ స్టార్ శర్వానంద్, దర్శకుడు సంపత్ నంది కాంబినేషన్‌లో వస్తున్న యాక్షన్ ఫిల్మ్ ‘భోగి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. పూర్తి యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కాగా ఈ చిత్ర సెట్స్ నుండి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చింది. షూటింగ్‌లో శర్వానంద్ పండించిన ఒక ఎమోషనల్ సీన్ చూసి తాను కట్ చెప్పడం కూడా మర్చిపోయానని దర్శకుడు సంపత్ నంది సోషల్ మీడియా వేదికగా తెలిపాడు.
గత దశాబ్ద కాలంలో శర్వానంద్ ఇచ్చిన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇదేనని ఆయన కొనియాడాడు. ఆ సీన్ ముగియగానే సెట్స్‌లో ఉన్న 200 మందికి పైగా యూనిట్ సభ్యులు చప్పట్లు కొడుతూ, కళ్ల నీళ్లు తుడుచుకున్నారని సంపత్ నంది పేర్కొన్నాడు. తన కెరీర్‌లో ఇలాంటి అనుభూతి కలగడం ఇదే మొదటిసారని తెలిపాడు.
ఇప్పుడు తాను చెప్పిన మాటలు గుర్తుపెట్టుకోవాలని.. థియేటర్లలో ‘భోగి’ చూస్తున్నప్పుడు ప్రేక్షకులు కూడా కచ్చితంగా ఇదే ఎమోషన్‌కు గురవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశాడు. ఇక ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
For the past 24hrs.. I’ve been trying to control myself n my emotions but can’t anymore…
I have witnessed one of the best emotional and never before performances of my dearest @ImSharwanand garu in the past one decade..
I didn’t realise…totally forgot to say CUT.. myself n… pic.twitter.com/BaYjpf5bSO
— Sampath Nandi (@IamSampathNandi) June 18, 2026


