సంపూ మరో సంచలనానికి సిద్దమవుతున్నాడట

Published on Aug 23, 2019 8:41 am IST

కొబ్బరిమట్ట అనూహ్యవిజయం సాధించడంతో సంపూర్ణేష్ బాబు మరియు దర్శక నిర్మాతలు తెలుగు రాష్ట్రాలలో అక్కడక్కడా విజయయాత్రలు చేస్తున్నారు. కొబ్బరిమట్ట టీం తిరుపతి వెళ్లగా అక్కడ వారికి మంచి ఆహ్వానం లభించింది. సంపూ కొరకు కొందరు బ్యానర్లు కట్టి ఆయన రాకకొరకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సంపూ తాను త్వరలోనే మరో చిత్రానికి సిద్దమవుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఆ మూవీ కూడా కొబ్బరిమట్ట చిత్రాన్ని తెరకెక్కించిన దర్శక నిర్మాతలే రూపొందించనున్నారని సమాచారం.

కాగా కొబ్బరిమట్ట చిత్రానికి రూపక్ రోనాల్డ్ సన్ దర్శకత్వం వహించగా సాయి రాజేష్ నీలమ్ నిర్మించారు. షకీలా, కత్తి మహేష్, ఇషికా సింగ్ ఇతర కీలకపాత్రలు చేయడం జరిగింది

సంబంధిత సమాచారం :