
‘నాకు బీపీ వస్తే ఏపీ, తెలంగాణ, బీహార్, కర్ణాటక ఇలా దేశం మొత్తం మండిపోద్ది..’, ‘రేసులో నన్ను అందుకోడానికి నేను రేసుగుర్రాన్ని కాదు.. రెడ్‌బుల్ తాగిన సింహాన్ని రా..’ ఏంటీ ఈ డైలాగులు ఎవరు చెప్పారా అని చూస్తున్నారా? ఇంకెవరూ.. మన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. ఒకప్పుడు సోషల్ మీడియాలో పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పుడు ఏకంగా సినీ పరిశ్రమలోనే అందరికీ సుపరిచితమైన పేరు. ‘హృదయకాలేయం’ లాంటి ఒక హిట్ సినిమా తర్వాత సంపూర్ణేష్ హీరోగా నటిస్తోన్న సినిమా ‘సింగం 123’. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా టీజర్‌ను ఈ ఉదయం విడుదల చేశారు. ఈ సినిమాలో సంపూ చెలరేగిపోయి నటించినట్లు టీజర్ ద్వారా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సినిమా ద్వారా సంపూర్ణేష్ బాబు అభిమానులకు పండగే అనేట్టు టీజర్ ద్వారా స్పష్టమవుతోంది. అక్షత్ అజయ్ శర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు మంచు విష్ణుయే కథ, స్క్రీన్‌ప్లేలను అందించడం విశేషం. వేసవి కానుకగా మే 15న ‘సింగం 123’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

