‘కరెంట్ తీగ’లో హైలైట్ కానున్న సంపూర్నేష్ బాబు ట్రాక్

‘కరెంట్ తీగ’లో హైలైట్ కానున్న సంపూర్నేష్ బాబు ట్రాక్

Published on Oct 27, 2014 11:32 AM IST

Manchu_sampu
మంచు మనోజ్ హీరోగా నటించిన ‘కరెంట్ తీగ’ సినిమా ఈ శుక్రవారం అనగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ముందుగ అక్టోబర్ 17న రిలీజ్ కావాలి కానీ హుదూద్ తుఫాన్ ప్రభావం వల్ల ఈ సినిమాని 31కి వాయిదా వేసారు. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వర్తపడు వాలిబార్ సంఘం’ సినిమాకి ఇది రీమేక్.

ఈ సినిమాలో ‘హృదయ కాలేయం’తో బాగా ఫేమస్ అయిన సంపూర్నేష్ బాబు ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. సంపూర్నేష్ బాబు పాత్ర ఉన్నది కొద్ది సేపైనా ఆడియన్స్ ని తెగ నవ్విస్తుందని అంటున్నారు. ‘సంపూర్నేష్ బాబు ట్రాక్ సినిమాలో కొద్దిసేపే ఉంటుంది. కానీ ఉన్నంత సేపూ ఆడియన్స్ ని తెగ నవ్విస్తాడు. కరెంట్ తీగ సినిమాకి సంపూర్నేష్ బాబు ట్రాక్ హైలైట్ అవుతుందని’ మంచు మనోజ్ తెలిపాడు.

జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మనోజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. అలాగే హాట్ బ్యూటీ సన్నీ లియోన్ ఓ అతిధి పాత్రలో కనిపించనుండడంతో అది ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. అచ్చు సంగీతం అందించాడు.

తాజా వార్తలు