ఆ పుకార్లలో నిజం లేదంటున్న సమంత

Published on May 18, 2019 11:01 am IST

సమంత అక్కినేని “మజిలీ” మూవీ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఎప్పుడూ నవ్వుతూ ప్రశాంతంగా కనిపించే సమంత ఈ మధ్య తనపై వచ్చిన కొన్ని పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టారు. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అన్ని పుకార్లకు సమాధానం ఇచ్చారు.

ఈ సంధర్బంగా సమంత” అమ్మకి నాకు మధ్య విబేధాలున్నాయనడంలో ఎటువంటి నిజం లేదు . నేను అందరికంటే ఎక్కువగా మా అమ్మను నమ్ముతాను. ఆమె చేసే ప్రార్ధనలో ఎదో మాయ ఉంటుంది. చిన్నప్పటిలాగే నాగురించి ప్రార్ధన చేయమని అమ్మని ఎప్పుడూ అడుగుతుంటాను. ఆమె ప్రార్థన చేస్తే అన్ని సమస్యలు తీరిపోతాయి. మా అమ్మమాత్రం తనకోసం తాను ఎప్పుడూ ప్రార్థన చేసుకోదు,అదే ఆమెలో ఉన్న ప్రత్యేకత. రెండో దైవం తల్లేనంటూ తన తల్లి ఫొటోనూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి రూమర్స్‌కి చెక్ పెట్టింది సమంత.
ఈ బ్యూటీ ప్రస్తుతం లేడీ డైరెక్టర్ నందినిరెడ్డి డైరెక్ట్ చేస్తున్న “ఓ బేబీ ఎంత చక్కగున్నావే” చిత్రంలో నటిస్తోంది. ఇది కొరియన్ మూవీ “మిస్ గ్రాని” కి అనువాదం. సమంత 70 ఏండ్ల వృద్దురాలిగా కనిపిస్తుందని సమాచారం.

సంబంధిత సమాచారం :

More