విజయ్ సేతుపతి రోల్ లో సముద్రఖని ?

విజయ్ సేతుపతి రోల్ లో సముద్రఖని ?

Published on Oct 20, 2020 1:10 AM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న ‘పుష్ప’ సినిమాలో మొదట తమిళ హీరో విజయ్‌ సేతుపతి ఓ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటించాలి. విజయ్ కూడా ఆ పోలీస్ పాత్రలో నటిస్తా అని కమిట్ అయ్యాడు. కానీ కరోనా కారణంగా షెడ్యూల్స్ అన్ని మిస్ అయి.. డేట్స్ అన్ని క్రాస్ అయి మొత్తానికి విజయ్ ఈ సినిమా నుండి తప్పుకున్నాడు. ఇప్పుడు ఈ పాత్రలోనే సముద్రఖనిను తీసుకోవాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడట. అలాగే రీసెంట్ గా ఈ పోలీస్ పాత్రలో మరో తమిళ్ హీరో ఆర్యను తీసుకోనున్నారని కూడా వార్తలు వచ్చాయి.

ఇక ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌటెలా నటిస్తోంది. అలాగే వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న ఈ సినిమాలో ఓ గిరిజన యువతి పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాతో సూపర్ హిట్ అందుకుంది రష్మిక. పుష్ప సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తుంది. అన్నట్టు షూట్ లో పాల్గొనబోయే స‌భ్యులంద‌రికీ వచ్చే వారం కరోనా టెస్ట్ చేసి, వారికీ కరోనా సోకే అవకాశం లేకుండా టీమ్ అందర్నీ జన సాంద్రతకు దూరమైన ప్రాంతానికి తరలించాలని టీమ్ భావిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు