పవన్ కళ్యాణ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సముద్రఖని

Published on Jun 9, 2023 1:00 am IST


నటుడు, దర్శకుడు అయిన సముద్రఖని కోలీవుడ్ లో పలు సక్సెస్ఫుల్ సినిమాలు తెరకెక్కించడంతో పాటు నటుడిగా కూడా మంచి పేరు సొంతం చేసుకున్నారు. ఇక ఇటీవల కొన్నాళ్లుగా పలు తెలుగు సినిమాల్లో కూడా నటించి ఇక్కడి ఆడియన్స్ నుండి కూడా క్రేజ్ సొంతం చేసుకున్నారు సముద్రఖని. ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న విమానం మూవీ జూన్ 9న అనగా రేపు విడుదల కానుంది.

ఈ సందర్భంగా విమానం ప్రమోషన్స్ లో పాల్గొంటున్న సముద్రఖని ఒక ఇంటర్వ్యూ లో భాగంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గొప్ప మనసు పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. భగవంతుడు మనకు రెండు చేతులు అందించింది ఒకటి మనకోసం అలానే మరొకటి ఇతరులకు సాయం చేయడానికని పవన్ తరచు చెప్తుంటారని, అలానే అటువంటి ఎన్నో గొప్ప విషయాలు ఆయన నుండి నేర్చుకున్నానని, తప్పకుండా రాబోయే రోజుల్లో తమ బ్రో మూవీ సమయంలో అవి అన్నీ ఒక్కొక్కటిగా వెల్లడిస్తానని అన్నారు సముద్రఖని. మొత్తంగా పవన్ పై సముద్రఖని చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం :