ఆర్ఆర్ఆర్ లో ఆ నటుడు కన్ఫర్మ్ !

Published on Jan 24, 2019 8:47 am IST


రాజమౌళి దర్శకత్వంలో స్టార్ హీరోలు ఎన్టీఆర్ , రామ్ చరణ్ లు కలిసి నటిస్తున్నమల్టీ స్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ప్రస్తుతం రెండవ షెడ్యూల్ ను జరుపుకుంటుంది. ఇక ఈ చిత్రంలో కోలీవుడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ సముద్రఖని నటించనున్నారని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

తాజాగా ఈ వార్తలు నిజమేనని కన్ఫర్మ్ అయ్యింది. ఈ చిత్రంలో ఆయన ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రంతో సముద్ర ఖని మొదటి సారి స్ట్రెయిట్ తెలుగుసినిమాలో నటిస్తున్నాడు. సుమారు 300 కోట్ల బడ్జెట్ తో పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య డివివి నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు తో పాటు హిందీ , తమిళ , మలయాళ భాషల్లో విడుదలకానుంది. అతి తర్వలో ఈ చిత్రంలో నటించే హీరోయిన్లను ప్రకటించనున్నారని సమాచారం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More