“స్వయంభు” లో నిఖిల్ కి జోడీగా సంయుక్తా మీనన్

nikhil

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ తన 20వ చిత్రం కోసం దర్శకుడు భరత్ కృష్ణమాచారితో జతకట్టనున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ పతాకంపై భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. నిఖిల్ 20 టైటిల్ ను మేకర్స్ నిఖిల్ పుట్టిన రోజున రిలీజ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. స్వయంభు టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నిఖిల్ సరసన హీరోయిన్ గా సంయుక్తా మీనన్ ఎంపికైంది.

ఈ నటుడి కెరీర్ లోనే అత్యంత ఖరీదైన సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిఖిల్ సరసన హీరోయిన్ గా నటించేందుకు ముందుకు వచ్చింది. ఆగస్ట్ 18న ఈ సినిమా గ్రాండ్ లాంచింగ్ వేడుక జరగనుంది. రెగ్యులర్ షూటింగ్ కూడా ఈ నెలలోనే మొదలవుతుంది. టాప్ టెక్నికల్ స్టాండర్డ్స్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో యోధుడిగా నటించేందుకు నిఖిల్ పూర్తిగా మేకోవర్ చేసుకున్నాడు. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

Exit mobile version