యాక్షన్ థ్రిల్లర్‌గా “జార్జి రెడ్డి” హీరో మూవీ..!

యాక్షన్ థ్రిల్లర్‌గా “జార్జి రెడ్డి” హీరో మూవీ..!

Published on Aug 16, 2021 6:44 PM IST

gandharva

వంగవీటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సందీప్ మాధవ్ ఆ తరువాత ‘జార్జి రెడ్డి’ సినిమాతో మరింత క్రేజ్ తెచ్చుకున్నాడు. ‘జార్జి రెడ్డి’ సినిమా సక్సెస్ తర్వాత సందీప్ మాధవ్ వరుస సినిమాలు చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ ఈ హీరో నుంచి ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా రాలేదు. అయితే చాలా రోజుల తర్వాత ఈయన నుంచి ఓ సినిమా రాబోతుంది.

సందీప్ మాధవ్ హీరోగా తాజాగా ‘గంధర్వ’ అనే సినిమా రూపొందుతోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ ద్వారా అప్సర్ అనే కొత్త దర్శకుడు పరిచయమవుతున్నాడు. మధు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే కొంతమేర షూటింగ్‌ను జరుపుకోగా ప్రస్తుతం కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు