83 లో రవిశాస్త్రి పాత్రకు ఎవరిని తీసుకున్నారంటే !

83 లో రవిశాస్త్రి పాత్రకు ఎవరిని తీసుకున్నారంటే !

Published on Feb 27, 2019 12:02 AM IST

Chirag Patil
లెజండరీ క్రికెటర్ కపిల్‌ దేవ్‌ జీవితం ఆధారంగా తెరకెక్కనున్న చిత్రం ’83’. ఖబీర్‌ ఖాన్‌ డైరెక్ట్ చేయనున్న ఈ చిత్రంలో స్టార్ హీరో రణ్వీర్ కపూర్ , కపిల్ దేవ్ పాత్రలో నటించనుండగా తమిళ హీరో జీవా వెటరన్ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్రలో అలాగే మరొక మాజీ ఇండియన్ క్రికెటర్ , సంధీప్ పాటిల్ పాత్రలో ఆయన కుమారుడు చిరాగ్ పాటిల్ నటించనున్నారు. ఇక తాజాగా మాజీ క్రికెటర్ , ప్రస్తుత భారత జట్టు కోచ్ రవిశాస్త్రి పాత్రకు యూరి : ది సర్జికల్ స్ట్రైక్ లో ముఖ్య పాత్రలో నటించిన ధైర్య ఖర్వా ను ఎంపిక చేశారు.

త్వరలోనే ఈచిత్ర షూటింగ్ లండన్ లోని లార్డ్స్ మైదానంలో ప్రారంభం కానుంది. రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్స్ , విబ్రి మీడియా సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రం 2020 ఏప్రిల్ 10న విడుదలకానుంది.

తాజా వార్తలు