దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇంట విషాదం

Published on Aug 22, 2019 1:30 pm IST

తొలి సినిమా అర్జున్ రెడ్డితోనే సంచలనం సృష్టించాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఆయన తల్లి వంగా సుజాత గురువారం తెల్లవారు జామున కన్నుమూశారు. వరంగల్ వెంకటయ్య కాలనీలో నివసిస్తున్న ఆమె తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు.దీనితో ఆయన కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

ఇటీవల అర్జున్ రెడ్డి సినిమాను కబీర్ సింగ్ పేరుతో బాలీవుడ్‌లో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు సందీప్. ఆయన ప్రస్తుతం తన తదుపరి చిత్ర స్క్రిప్ట్ పనులలో ఉన్నారు. ఆయన మహేష్ తో సినిమా చేయనున్నారని పలు వార్తలొస్తున్నప్పటికీ దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన జరగలేదు.

సంబంధిత సమాచారం :